NTV Telugu Site icon

Canada: కెనడా రాజకీయాల్లో ప్రకంపనలు.. ఉప ప్రధాని రాజీనామా

Canada

Canada

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి ట్రూడో కేబినెట్‌లో ఫ్రీలాండ్ అత్యంత శక్తివంతమైన మంత్రిగా ఉన్నారు. అయితే ట్రూడో ప్రజాదరణ కోల్పోవడంతో కేబినెట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆమె ప్రకటించారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో ప్రకటించిన నేపథ్యంలో క్రిస్టియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక మంత్రిగా పనిచేయడం తనకు ఇష్టం లేదని, కేబినెట్‌లో మరో పాత్రను తనకు ఆఫర్ చేశానని ట్రూడో శుక్రవారం తనతో చెప్పినట్లు ఫ్రీలాండ్ చెప్పారు. అయితే కేబినెట్‌ను విడిచిపెట్టడమే నిజాయితీ, ఆచరణీయ మార్గం అని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

క్రిస్టినా ఫ్రీలాండ్ కెనడియన్ రాజకీయవేత్త. 2019 నుంచి కెనడా ఉప ప్రధాన మంత్రిగా ఉన్నారు. అలాగే 2020 నుంచి ఆర్థిక మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఫ్రీలాండ్ టొరంటో రైడింగ్ ఆఫ్ యూనివర్శిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015 నుంచి యూనివర్శిటీ-రోజ్‌డేల్‌కు పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నారు.

 

Show comments