NTV Telugu Site icon

Brazil: బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్‌కు బ్రెయిన్ సర్జరీ.. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణ

Brazilian

Brazilian

బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా(79) బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత అక్టోబర్‌లో ఆయన ఇంటి దగ్గర పడిపోయారు. దీంతో మెదడుపై రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం మరోసారి గాయం తిరగగొట్టడంతో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంటెన్సివ్ కేర్‌లో కోలుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Pushpa-2 Controversy: పుష్ప- 2కి షెకావత్ కష్టాలు.. దాడులు చేస్తామంటూ కర్ణిసేన వార్నింగ్

సోమవారం లూయిజ్ తలనొప్పితో బాధపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంఆర్ స్కాన్ నిర్వహించారు. దీంతో ఇంట్రాక్రానియల్ హెమరేజ్‌ ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సావో పాలోలోని సిరియో లిబనేష్ ఆస్పత్రికి తరలించారు. సర్జరీ తర్వాత లూయిజ్ క్షేమంగా ఉన్నట్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఇది కూడా చదవండి: Siddharth : పుష్ప -2 పాట్నా ఈవెంట్ పై హీరో సిద్దార్ధ్ ఓవరాక్షన్

అక్టోబర్‌లో ఇంటి దగ్గర లాయిజ్ పడిపోయారు. మెదడుపై రక్తస్రావం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం కోలుకున్నారు. గాయం కారణంగా రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరు కాలేకపోయారు. నవంబర్ ప్రారంభంలో పరీక్షలు నిర్వహించగా బాగానే ఉన్నారు. తాజాగా మరోసారి గాయం తిరగతోడింది. ఇదిలా ఉంటే నవంబర్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు లూయిజ్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రధాని మోడీ సహా అమెరికా అధ్యక్షుడు బైడెన్, తదితర నేతలంతా హాజరయ్యారు.