Site icon NTV Telugu

Epstein files: రష్యన్ అమ్మాయితో సె*క్స్, బిల్ గేట్స్‌కు STD.. ఎస్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..

Bill Gates

Bill Gates

Epstein files: అమెరికాలో ఎప్‌స్టీన్ ఫైల్ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన మరికొన్ని పత్రాలు సంచలన విషయాలను వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు ఇందులో ఉంది. బిల్ గేట్స్ రష్యన్ మహిళతో సె*క్స్ చేసిన తర్వాత, ఆయన లైంగిక సంక్రమణ వ్యాధి(STD)తో బాధపడ్డారని వెల్లడించింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అప్పటి భార్య మెలిండా గేట్స్‌కు తెలియకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ప్రయత్నించడాని ఆరోపించాయి. అయితే, ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి ధ్రువీకరణ లేదు.

తాజాగా, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం లక్షలాది పత్రాలను విడుదల చేసింది. 2013లో ఎప్‌స్టీన్ తనకు తాను రాసిన ఇమెయిల్‌లలో ఈ ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ పత్రాలు విడుదలైన తర్వాత బిల్ గేట్స్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం అని అన్నారు. బిల్‌గేట్స్‌ను అపఖ్యాతి పాలుచేసేందుకు ఎప్‌స్టీన్ ఎంత దూరం వెళ్లాడనే విషయాన్ని ఇవి సూచిస్తున్నాయని గేట్స్ ప్రతినిధి డైలీమెయిల్‌కు తెలిపారు.

Read Also: Gold And Silver Rate: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్.. ఒక్కరోజే లక్ష 7,971 తగ్గిన వెండి, రూ.19,750 తగ్గిన బంగారం

అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన 30 లక్షలకు పైగా పత్రాలు, 2000కు పైగా వీడియోలు, 1.8 లక్షల ఫోటోలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. విస్తృత పరిశీలన తర్వాతే ఈ పత్రాలను విడుదల చేసినట్లు డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ తెలిపారు. ప్రస్తుత వివాదానికి కేంద్రంగా 2013 నాటి ఈమెయిల్ ఉంది. వీటిలో కొన్ని మెసేజ్‌లు బిల్ గేట్స్ అప్పటి సలహాదారు బోరిక్ నికోలిన్ గొంతుతో ఉన్నాయి. వీటిలో ‘‘ రష్యన్ అమ్మాయిలతో పడుకున్నాడు. లైంగిక సంక్రమన వ్యాధి బారిన పడ్డాడని, మెలిండా గేట్స్ కు రహస్యంగా ఇవ్వగల యాంటీ బయాటిక్స్ కోసం అడుగుతున్నాడని’’ ఎప్‌స్టీన్ ఆరోపించాడు. ఈ మెసేజ్ తొలగించాలని గేట్స్ తనను కోరాడని ఎప్‌స్టీన్ పేర్కొన్నారు.

పత్రాల్లో ఎప్‌స్టీన్, బిల్ గేట్స్ కలిసి ఉన్న కొన్ని ఇప్పటి వరకు చూడని ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే, ఫైల్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదని, ఎప్‌స్టీన్ నేరాల గురించి వారికి అవగాహన ఉందనే అర్థం కాదని యూఎస్ న్యాయశాఖ పేర్కొంది. బిల్‌గేట్స్ గతంలో ఎప్‌స్టీన్ తో తనకు ఉన్న పరిచయంపై పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. లైంగిక నేరస్తుడిగా ముద్ర పడిన ఎప్‌స్టీన్ 2019లో ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో విచారణ సమయంలో జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిల్ గేట్స్, మెలిండాలు 1994 నుంచి 2021 వరకు దాంపత్యంలో ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకుల కారణాల్లో.. ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధం కూడా ఒకటని మెలిండా పేర్కొన్నారు. అయితే, ఈ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు.

Exit mobile version