Site icon NTV Telugu

Anju-Nasrullah: అంజు-నస్రుల్లా ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. ఆలు లేదు చూలు లేదు

Anju Nasrulla Story

Anju Nasrulla Story

Big Twist In India Pakistan Duo Anju Nasrulla Episode: అంజు-నస్రుల్లా ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందేగా! ఫేస్‌బుక్‌లో పరిచయం అవ్వడం, అంజు పాకిస్తాన్‌కి వెళ్లడం, అక్కడ నస్రుల్లాతో కలిపి ఒక వీడియో షూట్ చేయడం.. అబ్బో పెద్ద హంగామానే నడిచింది. ఇదంతా చూసి.. వీళ్లిద్దరు వివాహం చేసుకున్నారని, అంజు ఇస్లాంని స్వీకరించి ఫాతిమాగా మారిందని అంతా అనుకున్నారు. వివాహ సర్టిఫికెట్ కూడా వైరల్ అవ్వడంతో.. వీరికి నిజంగానే పెళ్లి అయిపోయిందని భావించారు. కానీ.. తమకు పెళ్లి కాలేదని, అసలు తాము ప్రేమికులమే కాదంటూ ఇద్దరు కుండబద్దలు కొట్టారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.

Karnataka Crime: నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్

ఈ విషయంపై తొలుత నస్రుల్లా మాట్లాడుతూ.. తాను అంజుని పెళ్లి చేసుకోలేదని, తమ పేరుతో వైరల్‌ అవుతున్న సర్టిఫికెట్‌ కూడా ఫేక్‌ అని, అన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చాడు. అంజు తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని, తమ మధ్య స్నేహబంధం తప్ప ఇంకేమీ లేదని తెలిపాడు. తమ గురించి మీడియాలో రావడం, ముఖ్యంగా అంజు భారతీయురాలు కావడంతో.. భద్రత కోసం తాము పోలీసుల్ని సంప్రదించామని చెప్పాడు. ఈ క్రమంలోనే కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చిందన్నాడు. పాకిస్తాన్‌లో మహిళలు బుర్ఖా ధరించడం సాంప్రదాయం కాబట్టి.. అంజు కూడా బుర్ఖా ధరించిందని, అంతే తప్ప ఆమె మతం మారలేదని పేర్కొన్నాడు. ఇంకా ఇంకా హిందువుగానే ఉందని, పాకిస్తాన్‌ను చూడటానికి టూరిస్ట్ వీసా మీద ఇక్కడికి వచ్చిందని స్పష్టం చేశాడు. ఆగస్టు 4న అంజు వీసా గడువు ముగుస్తుందని, అప్పుడు భారత్ తిరిగి వెళ్లిపోతుందని అన్నాడు. తనకు అంజు అంటే ఇష్టమేనని, ఆమె అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుంటానని, కానీ తుది నిర్ణయం ఆమెదేనని చెప్పుకొచ్చాడు.

Cargo Ship Fire Accident: రవాణానౌకలో అగ్నిప్రమాదం.. 2857 కార్లు దగ్ధం

అనంతరం అంజు మాట్లాడుతూ.. తాను నస్రుల్లాని వివాహం చేసుకోలేదని, మతం కూడా మారలేదని స్పష్టం చేసింది. ఇతరులు ఎలాగైతే టూరిస్ట్ వీసాపై పర్యాటక ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తారో, తాను కూడా అలాగే టూరిస్ట్ వీసాపై పాక్‌కి వెళ్లానని తెలిపింది. తాను, నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమేనని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. తమ గురించి తెలిసి.. పాక్‌లో ఉన్న ఓ ప్రముఖ వ్లోగర్ తమతో ఒక వీడియో షూట్ చేశాడని.. అదేమీ ప్రీ వెడ్డింగ్ షూటో, పోస్ట్ వెడ్ షూటో కాదని స్పష్టతనిచ్చింది. తాను భారత్‌కు తిరిగొస్తున్నానని, భారత్‌కు వచ్చాక తన వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది.

Exit mobile version