Big Insult to Indians: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. ఈ సందర్భంగా యూఎస్ కామర్స్ సెక్రెటరీ హోవర్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటీ కంపెనీలు అమెరిక్లనే నియమించుకోవాలని సూచించారు. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే అని పేర్కొన్నారు. కేవలం అత్యుత్తమ/ విలువైన వ్యక్తులు మాత్రమే యూఎస్ లో అడుగు పెట్టాలని తెలిపారు. H-1B వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువగా భారతీయులేనని, హోవర్డ్ వ్యాఖ్యలు తమ దేశాన్ని అవమానించే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
Read Also: Surya Grahan 2025: రేపే ఆదివారం అమావాస్య.. ఈ నాలుగు రాశుల వారిపై సూర్యగ్రహణం ఎఫెక్ట్..!
అయితే, అమెరికా H1B వీసా నిబంధనల్లో డొనాల్ట్ ట్రంప్ మళ్లీ మార్పులు చేశాడు. H1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశాడు. H1B వీసా లాటరీ సిస్టమ్ను అమెరికా తొలగించడంతో.. భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1-B వీసాల దరఖాస్తు రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై సంతకం చేశారు. ఈ చర్య అమెరికాలోని వర్క్ వీసాలపై భారతీయ కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. H1-B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు చెల్లించే రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు.
