Bangladesh : ఘోర ప్రమాదం.. చెరువులో పడిన బస్సు..18 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోళ్తా పడింది.. ఈ ఘోర ప్రమాదంలో ఈ ప్రమాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు..
ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణిస్తున్నారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ తెలిపారు. 35 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు.. అసలు వివరాల్లోకి వెళితే.. ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న ఈ బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులో పడిపోయింది. బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..
Also Read
ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు కొందరు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా చెప్పుకొచ్చారు. చెరువులో నుంచి బస్సును వెలికితీసేందుకు పోలీసులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు.. మృతులను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు.. అదే విదంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.. క్షత గాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు..ఈ ఘోర ప్రమాదంతో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు.. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!