ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు ప్రమాదం తప్పింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫొటోలకు పోజులిచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఇందులో భాగంగా నిర్వాహకులతో కలిసి ఫొటోలు దిగేందుకు స్టేజ్ చివరి నుంచి రావడంతో ఒక్కసారిగా అమాంతంగా కిందపడిపోయారు. వెంటనే వేదికపై ఉన్న వారంతా స్పందించి వెంటనే పైకి లేపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసు.. విచారణ పేరుతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు..
గురువారం న్యూ సౌత్ వేల్స్‌లో జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పాల్గొన్నారు. మే నెలలో జరగనున్న జాతీయ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసంగం అనంతరం వేదికపై ఉన్నవారితో ఫొటోలు దిగేందుకు ఉల్లాసంగా కనిపించారు. ఫొటోలకు పోజులిచ్చేందుకు వెనక్కి వెళ్లగా సడన్‌గా కిందపడిపోయారు. వెంటనే సహచరులు పైకి లేపారు. అనంతరం నవ్వుతూ క్షేమంగా ఉన్నానంటూ చేతులు ఊపారు.
ఇది కూడా చదవండి: Eye Care: కంటి చూపులో తేడాలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
https://twitter.com/RomanMackinnon6/status/1907664875758956797
