Australia Assistance To Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్ధతు లభిస్తోంది. కొన్ని దేశాలు ఆర్థికంగా సాయం అందిస్తుండగా.. కొన్ని దేశాలు సైనికులతో సాయం చేస్తున్నాయి. ఇపుడు ఆస్ర్టేలియా ఏకంగా 74 మిలియన్ల యూఎస్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఉక్రెయిన్‌కు ప్రకటించింది.
Read also: Air India Flight: ఢిల్లీ-పోర్ట్ బ్లేయర్ విమానం విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండిండ్
రష్యా దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 70 సైనిక వాహనాలతో సహా అదనంగా 74 మిలియన్ల యూఎస్ డాలర్ల ఆర్థికసాయం అందించనున్నట్టు ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ సోమవారం తెలిపారు. ప్యాకేజీలో భాగంగా 28 M113 సాయుధ వాహనాలు, 14 ప్రత్యేక ఆపరేషన్ వాహనాలు, 28 మీడియం ట్రక్కులు మరియు 14 ట్రైలర్‌లను అందజేయనున్నట్టు తెలిపారు. రష్యా చర్యలను ఖండించారు. రష్యా చర్యలను వ్యతిరేకించిన ఆస్ర్టేలియా ప్రధాని ఉక్రెయిన్ విజయం సాధించడంలో సహాయం చేయడానికి ఆస్ట్రేలియా స్థిరంగా ఉందని అల్బనీస్ చెప్పారు. వాటితోపాటు ఆస్ట్రేలియా తన రికవరీ మరియు వాణిజ్య అవకాశాలకు మద్దతుగా ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులకు డ్యూటీ-ఫ్రీ యాక్సెస్‌ను మరో 12 నెలల పాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. అదనంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా యొక్క మొత్తం సహకారాన్ని 790 మిలియన్ల ఆస్ర్టేలియా కరెన్సీని ఇవ్వనున్నారు. వారిలో 610 మిలియన్ల సైనిక సహాయం కూడా ఉందని ప్రకటించారు. గత సంవత్సరం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై అధికార పట్టుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
Read also: Karnataka : ప్రేమ పేరుతో వల వేసిన కి ‘లేడీ ‘.. ఐదుగురితో కలిసి..
రష్యా సైనికుల్లో వాగ్నర్ తిరుగుబాటుతో రష్యన్లు అసౌకర్యానికి గురయ్యారు. రష్యా సైన్యంలోని అంతర్గత కల్లోలం పట్ల ఉక్రేనియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రష్యా సైన్యంలో అంతరర్గత కలహాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఆశతో ఉక్రెయిన్లు ఉన్నారు. రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఎలా సాయపడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
