Site icon NTV Telugu

వ్యాక్సిన్ వేసుకునే టీనేజ‌ర్ల‌కు ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ఫ్రీ !

వ్యాక్సిన్‌తోపాటు ఖ‌రీదైన గిఫ్ట్‌లూ ఫ్రీగా ఇస్తామంటూ వాషింగ్టన్‌లో అధికారులు ప్రకటించారు. అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న టీనేజ‌ర్ల‌ను వ్యాక్సిన్‌లు వేసుకునేలా ఎంక‌రేజ్ చేయ‌డానికి అక్కడి అధికారులు తిప్పలు ప‌డుతున్నారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ను ఫ్రీగా ఇవ్వడంతోపాటు అదృష్టం క‌లిసొస్తే 25 వేల డాల‌ర్ల స్కాల‌ర్‌షిప్ లేదా ఐప్యాడ్ కూడా ద‌క్కుతుంద‌ని… వాషింగ్ట‌న్ డీసీ మేయ‌ర్ మురియ‌ల్ బౌజ‌ర్ ప్రక‌టించారు. వాషింగ్ట‌న్ డీసీతోపాటు చుట్టుప‌క్కల ఉన్న టీనేజ‌ర్ల‌కు తొలి డోసు తీసుకుంటే ఎయిర్‌పాడ్స్, గిఫ్ట్‌కార్డులు, స్కాల‌ర్‌షిప్పులు ఫ్రీ అని ఆయ‌న చెప్పారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి, 12 నుంచి 17 ఏళ్ల యూత్… ఎవ‌రైతే బ్రూక్‌లాండ్ ఎంఎస్‌, సౌసా ఎంఎస్‌, జాన్సన్ ఎంఎస్‌ల‌లో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు ఎయిర్‌పాడ్స్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకుంటే మాత్రమే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.

Exit mobile version