NTV Telugu Site icon

చోక్సీ కోసం ప్రైవేట్ జెట్‌..దృవీక‌రించిన ప్ర‌ధాని…

భార‌త‌దేశం వ‌దిలి డొమినికాకు పారిపోయిన మోహుల్ చోక్సీని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.  పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ స్కామ్‌లో చోక్సీ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నారు. దాదాపు రూ. 200 కోట్ల రూపాయ‌ల స్కామ్ త‌రువాత చోక్సీ దేశం వ‌దిలి పారిపోయారు.  అప్ప‌టి నుంచి ఆయ‌న కోసం భార‌త అధికారులు గాలిస్తూనే ఉన్నారు.  అంటిగ్వా, అక్క‌డి నుంచి చోక్సీ డొమినికాకు వెళ్లారు.  ప్ర‌స్తుతం డొమినికాలో ఉన్న చోక్సీ కోసం ఇండియా ప్రైవేట్ జెట్ విమానం పంపిన‌ట్టు అంటిగ్వా ప్ర‌ధాని బ్రౌన్ తెలిపారు.  ఆదివారం ఉద‌య‌మే ఈ జెట్ డొమినికాలోని చార్లెస్ డగ్ల‌స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న‌ట్టు అంటిగ్వా ప్ర‌ధాని తెలిపారు.  అయితే, డొమినికా కోర్టు బుధ‌వారం వ‌ర‌కు భార‌త్‌కు అప్ప‌గించ‌కుండా స్టే ఇచ్చారు.  భార‌త్ నుంచి పారిపోయి వ‌చ్చిన వ్య‌క్తి అని, స్కామ్ లో ప్ర‌ధాన నిందితుడిగా చెప్పేందుకు కావాల్సిన ప‌త్రాలు జెట్‌లో వ‌చ్చి ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు.  డొమినికా నుంచే నేరుగా చోక్సీని భార‌త్‌కు తీసుకెళ్లాల‌ని,  అంటిగ్వాకు తిరిగి వ‌స్తే అక్క‌డ చ‌ట్ట‌ప‌ర‌మైన‌, రాజ్యాంగ‌ప‌ర‌మైన అన్ని ర‌క్ష‌ణ‌లు ద‌క్కుతాయ‌ని ప్ర‌ధాని బ్రౌన్ తెలిపారు.