Baba Vanga Predictions: “ఏలియన్స్, ప్రపంచం అంతం”.. భయపెడుతున్న బాబా వంగ జోస్యం..

  • భయపెడుతున్న బాబా వంగా అంచనాలు..
  • ఎలియన్స్ దగ్గర నుంచి
  • ప్రపంచ అంతం వరకు ప్రిడిక్షన్..
  • గతంలో నిజమైన 9/11 దాడి..
Baba Vanga Prediction

Baba Vanga Prediction

Baba Vanga Predictions: బాబా వంగా, ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాంజెలియా పాండేవా గుష్టెరోవా అనే అంధురాలైన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్తను బాబా వంగాగా పిలుస్తుంటారు. 85 ఏళ్ల వయసులో 1996లో మరణించింది. 12వ ఏట కంటి చూపును కోల్పోయిన ఈమె చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ‘‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్’’ అని పిలిచే బాబా వంగా చెప్పిన జోక్యం 9/11 న్యూయార్క్ ట్విన్ టవర్స్‌ని విమానాలు ఢీకొట్టడాన్ని ముందే ఊహించి చెప్పారు. ‘‘రెండు లోహపు పక్షులు మన అమెరికన్ సోదరులపైకి దూసుకుపోతాయి. తోడేళ్లు పొదల్లో నుంచి అరుస్తాయి. అమాయకమైన ప్రజల రక్తం నదులలో ప్రవవిస్తుంది’’ అంటూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి గురించి ముందు హెచ్చరించారు.

Read Also: UK: యూకే ఎన్నికల్లో మహిళల సరికొత్త రికార్డ్

5097 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని కూడా బాబా వంగా అంచనా వేశారు. ఆమె చెప్పిన అంచనాలలో ప్రముఖమైనవి ఇవే..
* 2025: యూరప్‌లో ఒక పెద్ద వివాదం ఆ ఖండంలోని జనాభాలో గణనీయమైన తగ్గింపుకు దారి తీస్తుంది.
* 2028: కొత్త శక్తి వనరులను కనుగొనే ప్రయత్నంలో మానవులు శుక్రుడిని చేరుకుంటారు.
* 2033: ధ్రువపు మంచుగడ్డలు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.
* 2076: కమ్యూనిజం ప్రపంచ వ్యాప్తంగా తిరిగి వస్తుంది.
* 2130: గ్రహాంతర వాసులతో కాంటాక్ట్ ఏర్పడుతుంది.
* 2170: ప్రపంచ కరువు.
* 3005: అంగారకుడిపై యుద్ధం.
* 3797: భూమిని నాశనం చేయడంతో పాటు, సౌరవ్యవస్థలోని మరోక గ్రహానికి వెళ్లే సామర్థ్యం మానవులకు వస్తుంది.
* 5079: ప్రపంచ అంతం.