NTV Telugu Site icon

Self Pleasure: లైంగిక ఆనందం కోసం ఆ తప్పు చేశాడు.. ఉంగరం ఇరుక్కొని ఆసుపత్రిపాలయ్యాడు

Steel Ring Stuck To Private

Steel Ring Stuck To Private

52 Year Old Man Uses Steel Ring For Self Pressure Which Stucks To His Private Part: కొందరు లైంగిక ఆనందం పొందడం కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. పార్ట్నర్ లేనప్పుడు.. స్వీయ సంపర్కంతో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలాంటప్పుడు ప్రైవేట్ పార్ట్స్‌లో ఏవేవో వస్తువులు పెట్టుకుంటారు. దీంతో.. లేనిపోని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రైవేట్ పార్ట్స్ దెబ్బతినడనమో, ఆ వస్తువులు అక్కడే ఇరుక్కుపోవడమో జరుగుతుంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన తెరమీదకి వచ్చింది. హస్త ప్రయోగానికి బదులు.. ఆ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్‌కి స్టీల్ రింగ్ పెట్టుకున్నాడు. దాంతో ఆ అనుభూతి పొందాలని భావించాడు. కానీ.. అది ప్రైవేట్ పార్ట్‌కి ఇరుక్కుపోయింది. ఆ దెబ్బకు ప్రైవేట్ పార్ట్ వాచిపోయింది. చివరికి ఆ నొప్పిని భరించలేక వైద్యుల్ని సంప్రదించగా.. రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి, దాన్ని బయటకు తీశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Actress Shobana: శోభన ఇంట్లో చోరీ.. ఆమె చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

అతను స్విట్జర్లాండ్‌కు చెందిన మధ్యవయస్కుడు. అతని వయసు 52 సంవత్సరాలు. ఇటీవల అతడు థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లాడు. ఒంటరిగా వెళ్లిన అతనిలో రాత్రి సమయంలో కోరికలు రగిలాయి. పార్ట్నర్ లేకపోవడంతో.. కొంచెం భిన్నంగా ఆ ఆనందం పొందాలని అనుకున్నాడు. ఓ స్టీల్ రింగ్‌ని తన ప్రైవేట్ పార్ట్‌లో పెట్టాడు. అయితే.. ఆ ఉంగరం అతని ప్రైవేట్ పార్ట్‌కి ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. అంతేకాదు.. అతని ప్రైవేట్ పార్ట్ వాచిపోయింది. నొప్పి విపరీతంగా పెరిగిపోవడంతో.. అతడు ఆసుపత్రివైపు పరుగులు తీశాడు. వైద్యులు వెంటనే అతడ్ని తమ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని.. రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి, ఆ ఉంగరాన్ని తొలగించారు. ఆ ఉంగరాన్ని కత్తిరించడం కోసం.. హెవీ డ్యూటీ కట్టింగ్ టూల్స్ ఉపయోగించారు. నిజానికి.. వైద్యుల వద్ద ఆ ఉంగరం కత్తిరించే సామాగ్రి లేదు. అప్పటికప్పుడే మరో చోట నుంచి వాటిని తెప్పించి, ఆపరేషన్ చేసి, సక్సెస్ సాధించారు.

Kishan Reddy: యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటన

ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ థాయ్‌లాండ్‌లోనే బర్మీస్ వ్యక్తి ఇలాంటి దిక్కుమాలిన చర్యకే పాల్పడ్డాడు. ప్రియురాల్ని ఇంప్రెస్ చేసేందుకు గాను.. తన ప్రైవేట్ పార్ట్‌ని పెంచుకోవాలని భావించాడు. అందుకోసం అతడు స్టీల్ రింగ్‌ని తన ప్రైవేట్ పార్ట్‌కి పెట్టుకున్నాడు. అయితే.. ఆ ఉంగరం చిన్నదిగా ఉండటంతో, అది ఇరుక్కుపోయింది. తనకు తీవ్ర నొప్పి ఉన్నా.. సిగ్గుతో ఆసుపత్రికి వెళ్లలేకపోయాడు. చివరికి వారం రోజుల తర్వాత సిగ్గువిడిచి వైద్యుల్ని సంప్రదించాడు. అప్పుడు కూడా కట్టర్ల సహకారంతో ఆ ఉంగరాన్ని తొలగించారు.