Site icon NTV Telugu

Earthquake: తైవాన్‌లో భూకంపం.. తీవ్రత 5.0గా నమోదు

Earthquakebihar

Earthquakebihar

ఈశాన్య తైవాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది. తైవాన్ రాజధాని తైపీలో పలు భవనాలు ప్రకంపనలకు గురయ్యాయి. కొన్ని సెకన్ల పాటు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇది కూడా చదవండి: Priyansh Arya: కుర్రాడికి ఎందుకు అంత డబ్బు అన్నారు.. కట్ చేస్తే సెంచరీతో దుమ్ములేపాడు!

తైపీకి తూర్పున ఉన్న యిలాన్ కౌంటీలో దాదాపు 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించినప్పుడు భవనాలు కొద్దిసేపు కంపించినట్లు యిలాన్ ఫైర్ బ్యూరో అధికారి తెలిపారు. తైపీ మెట్రో వ్యవస్థ ముందు జాగ్రత్తగా రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది. ఇక హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా కొనసాగాయి.

ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ విపత్తులో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 1400 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan : మార్క్ శంకర్ హెల్త్ బులిటెన్.. ఇప్పుడెలా ఉందంటే..?

 

Exit mobile version