NTV Telugu Site icon

US: అమెరికా నర్తకి ఎమిలీ గోల్డ్ ఆత్మహత్య.. షాక్‌లో అభిమానులు

Ussucide

Ussucide

అతిచిన్న వయసులోనే అమెరికా నర్తకి తనువు చాలించింది. అర్ధాంతరంగా ప్రాణాలు విడిచింది. ఆ ఘటన ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే సూసైడ్ వెనుక ఉన్న మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.

కాలిఫోర్నియాకు చెందిన 17 ఏళ్ల ఎమిలీ గోల్డ్.. తాజా అమెరికాస్ గాట్ టాలెంట్‌లో క్వార్టర్స్ ఫైనల్‌కు చేరింది. ఆమె లాస్ ఓసోస్ హై స్కూల్ డ్యాన్స్ టీమ్‌తో ఈ టాలెంట్ షోలోకి ప్రవేశించింది. అయితే ఈ హైస్కూల్ డ్యాన్సర్ సెప్టెంబర్ 13న రాత్రి 11:52 గంటలకు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు శాన్ బెర్నార్డినో కరోనర్ కార్యాలయం ప్రజలకు వెల్లడిచింది. దీంతో ఆమె మరణవార్త తెలిసి అభిమానులు, తోటి డ్యాన్సర్లు, శ్రేయోభిలాషులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.శుక్రవారం అర్ధరాత్రి రాంచో కుకమొంగాలోని ఓ ఓవర్‌పాస్‌ కింద ఆమె మృతదేహం లభ్యమైంది.

ఇది కూడా చదవండి: Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్

కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రోడ్రిగో జిమెనెజ్ మాట్లాడుతూ.. అధికారులు ఘటనాస్థలికి వచ్చినప్పుడు.. 210 తూర్పు వైపున ఉన్న కార్‌పూల్ లేన్‌లో 17 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళను గుర్తించినట్లు తెలిపారు. అమెరికాస్ గాట్ టాలెంట్‌లో ఎమిలీ గోల్డ్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఒక నెల తర్వాత ఆమె అకాల మరణం అందర్నీ షాక్‌కు గురిచేసింది. వారి ప్రయాణం ఆగస్టులో ముగిసినప్పటికీ.. ఈ బృందం వారి భావోద్వేగ నిష్క్రమణ తర్వాత న్యాయమూర్తి సైమన్ కోవెల్ నుంచి హృదయపూర్వకంగా నిలబడి ప్రశంసలు అందుకుంది. శాశ్వతమైన ముద్ర వేసింది.

ఇది కూడా చదవండి: Jani Master: ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డా.. వైరల్ అవుతున్న జానీ మాస్టర్ పాత వీడియో

ఎమిలీ గోల్డ్ మరణంపై లాస్ ఓసోస్ హై స్కూల్ వర్సిటీ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. “మా అందమైన, దయగల మరియు ప్రేమగల ఎమిలీ గోల్డ్. సీనియర్ మరియు వర్సిటీ డ్యాన్స్ కెప్టెన్ మరణాన్ని మేము చాలా బరువైన హృదయంతో పంచుకున్నాము. ఎమిలీ తన బలం, నిబద్ధత, దయ, కరుణ మరియు అత్యంత వినయపూర్వకమైన హృదయం ద్వారా మా ప్రధాన జట్టు విలువలలోని ప్రతి అంశాన్ని ఎల్లప్పుడూ మూర్తీభవిస్తుంది.”అని లాస్ ఓసోస్ హై స్కూల్ వర్సిటీ డ్యాన్స్ టీమ్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన ద్వారా రాసింది. అంతేకాకుండా ఆమె కుటుంబానికి తోడ్పాటు అందించేందుకు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. జెనెట్ ఫియరో అనే మహిళ GoFundMe ప్రచారం మొదలుపెట్టింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సహాయం చేయాల్సింది కోరింది. ఇదిలా ఉంటే గోల్డ్ మరణంపై అధికారులు ఆరా తీస్తున్నారు.