Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్‌లోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు.. 15 మంది మృతి

Pakistan

Pakistan

పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక రసాయన ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. మరో ఏడుగురు గాయాలు పాలయ్యారు. పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లోని ఒక రసాయన కర్మాగారంలో ఒక బాయిలర్ పేలింది. దీంతో అక్కడిక్కడే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శక్తివంతమైన పేలుడు కారణంగా నిర్మాణాలు కూడా కూలిపోయాయి. సహాయం కోసం బాధితులు ఆర్తనాదాలు చేశారు. ఇక సహాయ చర్యల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

ఇది కూడా చదవండి: Amit Shah: ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలిసింది.. బీఎస్‌ఎఫ్ దినోత్సవంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

లాహోర్ నుంచి 130 కిలోమీర్ల దూరంలో ఉన్న ఫైసలాబాద్ జిల్లాలో ఈ ఉదయం దుర్ఘటన జరిగినట్లుగా ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ రాజా జహంగీర్ అన్వర్ వెల్లడించారు. పేలుడు కారణంగా భవనం కూలిపోయిందని తెలిపారు. ఇప్పటి వరకు 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. మరో ఏడుగురిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. సహాయ చర్యల్లో జిల్లా యంత్రాంగం పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అధికారుల నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు చెప్పారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CJI BR Gavai: నేను లౌకికుడిని.. ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నా.. వీడ్కోలు ప్రసంగంలో గవాయ్ వ్యాఖ్య

Exit mobile version