GST revenue collections: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) అమలు ప్రారంభమయ్యాక గత నెల(జులై)లో రెండో అత్యధిక వసూళ్ల రికార్డు నమోదైంది. రూ.1,48,995 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. 2021 జూలై నెలతో పోల్చితే ఇది 28 శాతం ఎక్కువ కావటం విశేషం. ఇందులో సీజీఎస్‌టీ రూ.25,751 కోట్లు కాగా ఎస్‌జీఎస్‌టీ రూ.32,807 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.79,518 కోట్లు అని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఐజీఎస్‌టీలో రూ.41,420 కోట్లు దిగుమతుల పైన వచ్చింది.
రూ.10,920 కోట్లు సెస్ రూపంలో వచ్చాయి. ఇందులో రూ.995 కోట్లు ఇంపోర్ట్స్ పైన సమకూరాయి. ప్రభుత్వం ఐజీఎస్‌టీ వసూళ్ల నుంచి రూ.32,365 కోట్లను సీజీఎస్‌టీకి, రూ.26,774 కోట్లను ఎస్‌జీఎస్‌టీకి కేటాయింపులు జరిపింది. ఈ రెగ్యులర్ సెటిల్‌మెంట్ల అనంతరం జులై నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన మొత్తం ఆదాయం (రెవెన్యూ) వరుసగా రూ.58,116 కోట్లు (సీజీఎస్‌టీ), రూ.59,581 కోట్లు (ఎస్‌జీఎస్‌టీ). 2021 జులైలో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.1,16,393 కోట్లు కాగా 2022 జులైలో వచ్చిన రెవెన్యూ 28 శాతం ఎక్కువ కావటం గమనార్హం.
Rice Rates: రెండు నెలల్లో 30 శాతం వరకు పెరిగిన బియ్యం ధరలు
2022 జులైలో దిగుమతుల పైన సమకూరిన ఆదాయం 2021 జులైతో పోల్చితే 48 శాతం అధికం. 2022 జులైలో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన రెవెన్యూ 2021 జులై కన్నా 22 శాతం ఎక్కువ. వరుసగా గత ఐదు నెలల నుంచి జీఎస్‌టీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లకు పైగానే వస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. 2021లో మార్చి నుంచి జులై నెల వరకు అంటే ఐదు నెలల్లో వచ్చిన జీఎస్‌టీ రెవెన్యూతో పోల్చితే 2022లో మార్చి-జూలై మధ్య కాలంలో సమకూరిన జీఎస్‌టీ ఆదాయంలో వృద్ధి 35 శాతమని ప్రభుత్వం వివరించింది.
జీఎస్‌టీ అమలుకు సంబంధించి కౌన్సిల్ తీసుకున్న పలు నిర్ణయాల సానుకూల ప్రభావమిదని పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనటానికి కూడా ఇదొక నిదర్శమని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో రూ.7.36 కోట్ల విలువైన ఇ-వే బిల్లులు జనరేట్ కాగా జూన్ నెలలో అంతకన్నా ఎక్కువగా రూ.7.45 కోట్ల బిల్లులు జనరేట్ అయినట్లు వెల్లడించిది.