Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం

  • మే 29న బుధుడి మార్పు..
  • మిథున రాశిలో బుధ-గురు-శుక్ర గ్రహాల యుతి..
  • అరుదైన సరస్వతి యోగం ప్రారంభం..
  • 6 రాశుల వారికి అదృష్టం..
Saraswati Yog

Saraswati Yog

Mercury transit 2026: జ్యోతిష్య పరంగా ఒక్కో గ్రహ సంచారం వల్ల, ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతుంటాయి. మే నెల చివరి వారంలో అరుదైన, చాలా మంచిదైన గ్రహ మార్పు చోటుచేసుకుంటోంది. మే 29, 2026న తెలివికి, వాక్చాతుర్యానికి అధిపతి అయిన బుధుడు మిథునరాశిలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే శుక్రుడు, గురుడు మిథున రాశిలో ఉన్నారు. దీని ఫలితంగా బుధ, శుక్ర, గురు గ్రహాల యుతి ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయికతో అత్యంత అరుదైన, మంచిదైన ‘‘ సరస్వతి యోగం’’ ఏర్పడుతోంది. జ్ఞానం, విద్య, కళ, సంగీతం, రచన, సమాచార రంగాలలో ఉన్నవారికి ఒక వరంగా పరిగణించబడుతుంది. ఈ గొప్ప సంయోగం యొక్క ప్రభావం ప్రజల నిర్ణయాత్మకత, వాక్చాతుర్యం, మేధో నైపుణ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

వృషభం- భారీ ధన లాభాలు:

×
×
Ad

ఈ గ్రహాల కలయిక వృషభ రాశి వారికి సంపదను సూచించే రెండో ఇంటిలో మిథున రాశిలో ఏర్పడుతుంది. దీంతో ఆర్థిక విషయాలు శుభప్రదంగా ఉంటాయి. డబ్బు సంపాదన, పొదుపులో విజయం ఉంటుంది. మీకు అకాస్మత్తుగా ఆర్థిక లాభం, పూర్వీకుల ఆస్తి వారసత్వంగా లభించే అవకాశం ఉంది. మీ మాటలకు బలమైన ఆకర్షణ ఉంటుంది, దీని వల్ల వ్యాపార ఒప్పందాలను , పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మిథునం- అన్ని లాభాలే:

మిథున రాశి వారికి స్వరాశిలోనే ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. సమజాంలో, పని ప్రదేశాల్లో గౌరవం, హోదా పెరుగుతాయి. మీరు విద్యా, రచన, మీడియా రంగాల్లో ఉంటే గొప్ప విజయం మీ సొంతమవుతుంది.

సింహ రాశి- ఆదాయం సిద్ధిస్తుంది.

సింహ రాశి వారికి ఆదాయాన్ని సూచించే 11వ స్థానంలో ఈ గ్రహాల యుతి జరుగుతోంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీకు కొత్త , శాశ్వత మార్గాలు తెరుచుకుంటాయి. దీర్ఘకాలంగా నిలిచిన నిధులు తిరిగి లభించే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి ఇది శుభ సమయం.

కన్యా రాశి- కెరీర్‌లో మార్పులు.

కన్యా రాశి వారికి కర్మ స్థానాన్ని సూచించే 10 వ స్థానంలో ఈ సరస్వతి యోగం ఏర్పడుతున్న కారణంగా కెరీర్‌లో పదోన్నతులు లేదా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపార విస్తరణకు దారి తీసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి.

తులా రాశి- అదృష్టం మీ పక్షానే.

తులా రాశి వారికి అదృష్ట స్థానమైన 9వ స్థానంలో ఈ శుభయోగం ఏర్పడుతుంది. దీంతో చాలా కాలంగా నిలిచిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సుదూర ప్రాంతంలోని ఆలయాలు, ప్రదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కలలు నెరవేరుతాయి.

ధనస్సు రాశి- వ్యాపారం, భాగస్వామ్యంలో వృద్ధి.

ధనస్సు రాశి వారికి 7వ ఇంట్లో అంటే భాగస్వామ్యం, వైవాహిక జీవితాన్ని సూచించే స్థానంలో ఈ గ్రహాల కలయిక జరుగుతోంది. దీని వల్ల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తే, ఇది మీకు మంచి సమయంగా పరిగణించవచ్చు. భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పె రుగుతంది. మీ జీవిత భాగస్వామి అదృష్టం, మీకు ఆర్థిక, వృత్తిపరమైన పురోగతిని అందిస్తుంది.