యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేశమే అశ్చర్యపోయేలా కేసీఆర్ ప్రభుత్వం… యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తోంది. అయితే.. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్..పనులు త్వరగా పూర్తి కావాలని కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే… ఆ రోజున సీఎం కేసీఆర్ వెంటే ఉన్న రాజ్యసభ ఎంపీ, టీఆర్‌ఎస్ కీలక నేత సంతోష్ కుమార్… విద్యుత్ వెలుగుల్లో, వెన్నెల కాంతిలో శోభిల్లుతున్న యాదాద్రి ఆలయ అందాలను తన కెమెరాలో బంధించారు. ఒక పక్క రాజకీయ అంశాలతో తీరికలేకున్నా.. పచ్చని భారతం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారను ఎంపీ సంతోష్. ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయం కాంతులను తన కెమెరాలో బంధించారు. అయితే… ఇప్పుడు ఆ ఆలయ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కొత్త కాంతులతో యదాద్రి ఆలయం..

yadadri temple