‘KGF 2’లో రాఖీ భాయ్ ప్రేయసి రీనా దేశాయ్ గా అలరించిన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీనిధి థ్రెడ్ వర్క్‌తో ఉన్న అందమైన ఆకుపచ్చ సూట్‌లో పోజులిచ్చింది. సాంప్రదాయ లుక్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ భారీ ఇయర్ రింగ్స్, తేలికపాటి మేకప్‌తో చాలా అందంగా కన్పిస్తోంది. ఇక యాక్షన్ డ్రామా ‘KGF 2’ ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో, ఇందులో హీరోయిన్ గా మెరిసిన శ్రీనిధి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో ఉన్న భామలు చాలా తక్కువనే చెప్పాలి. మరి శ్రీనిధిని ఇక నుంచి పాన్ ఇండియా ఆఫర్లు వరిస్తాయేమో చూడాలి.
Srinidhi Shetty : సాంప్రదాయ లుక్ లో ‘కేజీఎఫ్’ బ్యూటీ… పిక్స్ వైరల్

Srinidhi Shetty