Site icon NTV Telugu

Rakul Preet Singh : స్టన్నింగ్ లుక్ లో బ్యూటీ… పిక్స్ వైరల్

Rakul

రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫొటోలతో సమ్మర్ లో మరింత హీట్ ని పెంచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ లుక్ లో మెరిసిపోతున్న రకుల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ “ఎటాక్ పార్ట్ 1” విడుదలకు సిద్ధమవుతోంది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కూడా కీలకపాత్రల్లో నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్‌లలోకి రానుంది. ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఈ భామ. మరోవైపు అజయ్ దేవగన్ సరసన “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో “డాక్టర్ జి”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “థ్యాంక్స్ గాడ్” వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ చిత్రాలు “అయలాన్”, “ఇండియన్ 2” వంటి భారీ చిత్రాల్లో కనిపించబోతోంది.

Exit mobile version