విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలు అభిమానులను షాక్ కు గురిచేసింది. ప్రకాష్ రాజ్ కు గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే మరో పెళ్లి అనే వార్తలు అభిమానులను కాస్త గందరగోళానికి గురిచేశాయి. నిన్న ప్రకాష్ రాజ్ పెళ్లి రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్బంగా తన కొడుకు అడిగిన కోరికను నెరవేర్చాడు. ‘మా వివాహానికి సాక్షిగా వేదాంత్ మరోసారి పెళ్లిచేసుకోమని కోరాడు. అందుకే ఈ రాత్రి ఇలా మళ్ళీ పెళ్లి చేసుకున్నాం’ అంటూ ప్రకాష్ రాజ్ ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలు ఒక్కసారిగా ఎక్కువ షేర్ అవ్వడంతో వైరల్ గా మారాయి. కాగా, ప్రకాష్ రాజ్ పెళ్లిరోజుకు ఆయన మాజీ భార్య పిల్లలు కూడా హాజరై ఘనంగా జరుపుకున్నారు.
ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి ఫోటోలు వైరల్
Show comments