NTV Telugu Site icon

SBI Recruitment : డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 5వేలకు పైగా ఉద్యోగాలు.. నెలకు జీతం 60వేలు..

Sbi

Sbi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అర్హతలు, జీతం మొదలగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు – 5280..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 825 ఖాళీలు.

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సీటిలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు..

వయస్సు..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 21 నుంచి 30 ఏళ్లు మించి ఉండకూడదు..

దరఖాస్తు ఫీజు(జనరల్ కేటగిరీ) -750రూపాయలు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు..

ఎంపిక విధానం..

ఆన్ లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

ఆబ్జెక్టివ్ టెస్ట్-120 మార్కులకు (2 గంటల సమయం, నాలుగు సెక్షన్లు)
డిస్ క్రిప్టివ్ టెస్ట్ – 50 మార్కులకు ( 30 నిమిషాల సమయం).. ఇంగ్లీష్ భాషపై టెస్ట్… లెటర్ రైటింగ్, ఎస్సే..

అనుభవం..

ఏదైనా కమర్షియల్ బ్యాంకు లేదా రీజనల్ గ్రామీణ బ్యాంకులో రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి..

జీతం.. రూ.36వేల నుంచి రూ.63వేల 840 వరకు ఉంటుంది..

దరఖాస్తు తేదీ ప్రారంభం – నవంబర్ 22.
దరఖాస్తుకు చివరి తేదీ- డిసెంబర్ 12.
ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్లు sbi.co.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోగలరు..