NTV Telugu Site icon

SBI PO Mains Result 2023: ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

Sbi Results

Sbi Results

ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పీఓ మెయిన్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు sbi.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.. ఎస్బీఐ పీఓ మెయిన్స్ 2023 ఫలితాలను విడుదల చేసింది. ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు..

ఎలా చెక్ చేసుకోవాలంటే?

ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
ఆ తరువాత, కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
అనంతరం కరెంట్ ఓపెనింగ్ లింక్ పై క్లిక్ చేయాలి.
ఎస్బీఐ పీఓ మెయిన్స్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
కొత్త పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
తదుపరి అవసరాల కోసం ఫలితాల హార్డ్ కాపీని భద్రపర్చుకోండి..

ఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైకోమెట్రిక్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. జనవరి 16 నుంచి సైకోమెట్రిక్ పరీక్ష, 21 నుంచి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు..

ఇకపోతే.. ఎస్బీఐ లో మొత్తం 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి 2023 సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు అవకాశం ఇచ్చారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికార వెబ్ సైట్ ను పరీశీలించవచ్చు.. పూర్తి వివరాలు అందులో పొందుపరిచారు..