NTV Telugu Site icon

SBI Notification 2023: ఎస్‌బీఐలో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఒక్కరోజే గడువు..

Sbi

Sbi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో భారీగా దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 5,447 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. దేశవ్యాప్తంగా ఉన్న 16 సర్కిల్స్‌లో 5,447 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌(సీబీవో) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో 167 బ్యాక్‌లాగ్‌ పోస్టు కూడా ఉన్నాయి. గతేడాది 1,422 సీబీవో పోస్ట్‌లకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు..ఈ ఉద్యగాలకు అప్లై చేసుకొనేవారికి రేపే లాస్ట్ త్వరగా అప్లై చేసుకోండి..

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి..

వయసు..

అక్టోబర్ నాటికి 21-30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది..

జీతం..

ప్రారంభ వేతన శ్రేణి రూ.36,100-రూ.63,840గా ఉంటుంది..

ఎంపిక విధానం..

ఈ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు చేపట్టే నియామక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. తొలుత ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల స్క్రీనింగ్‌ ఉంటుంది. చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 17.12.2023
ఆన్‌లైన్‌ టెస్ట్‌ కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 జనవరిలో
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 2024 జనవరిలో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers లో పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోగలరు..