ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్‌బీఐ తమ శాఖల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 439 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు బ్యాంక్ తెలిపింది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు ..439
అసిస్టెంట్ మేనేజర్- 335
డిప్యూటీ మేనేజర్ -80
చీఫ్ మేనేజర్ -2
మేనేజర్- 8
సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ – 7
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 1
ప్రాజెక్ట్ మేనేజర్ -6
అర్హతలు..
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ లాంటి కోర్సులు పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
వయస్సు- 2023 ఏప్రిల్ 30 నాటికి 32 నుంచి 45 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు– జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
వేతనం– రూ.1 లక్ష వరకు జీతం.. వివిధ శాఖలకు జీతం మారుతుంది..
దరఖాస్తు ప్రారంభం- 2023 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2023 అక్టోబర్ 6
ఆన్‌లైన్ టెస్ట్- 2023 డిసెంబర్ లేదా 2024 జనవరి
ఎలా అప్లై చేసుకోవాలంటే?
అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Latest Announcements సెక్షన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి.
కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి…
ఆ తర్వాత విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి.. ఆ తర్వాత అన్ని చేసి సబ్మిట్ చెయ్యాలి.. ఈ నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..