Site icon NTV Telugu

South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ

Sam (11)

Sam (11)

స్టయిఫండ్ కోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సపోర్ట్ చేశారనే ఆరోపణలతో ప్రొఫెసర్ భట్టాచార్యను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేశారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొట్టాడని ప్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్యను తొలగిస్తున్నట్లు గురువారం యూనివర్సిటీ ప్రకటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU) ఎకనామిక్స్ ప్రొఫెసర్ భట్టాచార్యను ఉద్యోగం నుంచి తొలగించింది. 2011లో SAU లో చేరిన ఎకనామిక్స్ ఫ్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్య.. ఆర్థిక శాస్త్ర విద్యార్థుల మొదటి బ్యాచ్ కు భోధించారు. అయితే యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో 2023లో సస్పెండ్ అయిన నలుగురు ఫ్రొఫెసర్లతో భట్టాచార్య ఒకరు. మిగతా ముగ్గురు ప్రొఫెసర్లు చేసిన తప్పును ఒప్పుకోవడంతో పాటు మరోసారి అలా చేయమని లెటర్ రాసివ్వడంతో వారిని తిరిగి నియమించారు. అయితే భట్టాచార్య మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో అతడిని విధులనుంచి తొలగించారు.

Exit mobile version