NTV Telugu Site icon

Postal Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో 1,899 ఉద్యోగాలు..

Jobs

Jobs

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..పోస్టాఫీసులో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,899 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు,
సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు,
పోస్ట్‌మ్యాన్ 585 పోస్టులు,
మెయిల్ గార్డ్ 3 పోస్టులు,
ఎంటీఎస్‌ 570 పోస్టులు

అర్హతలు..

పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడా విభాగం లో అర్హత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల కు ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవచ్చు..

ఇకపోతే టీఆర్‌టీకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాతే విద్యాశాఖ పరీక్ష తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్‌ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని మొదట ప్రకటించినా ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదా వెయ్యనున్నారు.. మొత్తం 5,089 ఖాళీల భర్తీ చెయ్యనున్నారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ను విడుదలచేసి భర్తీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు..