NTV Telugu Site icon

Postal Jobs 2024 : పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

Post Office

Post Office

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పోస్టల్ శాఖలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఇండియన్ పోస్ట్ ఉత్తర ప్రదేశ్ సర్కిల్‌లో 78 డ్రైవర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింwhewది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే  అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ ఉద్యోగ వార్తలలో ప్రచురించబడిన తేదీ నుండి 42 రోజులలోపు అంటే ఫిబ్రవరి 16 వరకు.. మొత్తం 78 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, హెవీ డ్రైవింగ్ అనుభవం మరియు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉండాలి.

వయస్సు..

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, వారి వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి..

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫేజ్ 2కి హాజరు కావాలి. ఫేజ్ 2లోని ప్రతి పేపర్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ పోస్టులకు ఫైనల్ గా సెలెక్ట్ చేస్తారు..

ముఖ్యమైన సమాచారం..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పత్రాలతో పాటు నింపిన ఫారమ్‌ను మేనేజర్ (GRA), మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్, GPO కాంపౌండ్, కాన్పూర్- 208001, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.. మిగిలిన సమాచారం కోసం అధికార వెబ్ సైట్ లో పరిశీలించగలరు..