Site icon NTV Telugu

ONGC Recruitment 2024: ONGCలో జూనియర్ కన్సల్టెంట్స్ పోస్టులు.. పూర్తి వివరాలివే..

Jobbss

Jobbss

ఈ మధ్య నిరుద్యోగులు వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..మొత్తం 12 పోస్ట్‌ల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ ఉంటుంది. డ్రిల్లింగ్ ఫీల్డ్ ఆపరేషన్స్‌లో కనీసం 05 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకుందాం..

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీని పొందిన ఉండాలి..

వయోపరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థులు రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు..

అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో పాటు డ్రిల్లింగ్ సర్వీసెస్, రూమ్ నెం. 40, 2వ అంతస్తు, KDM భవన్, మెహసానా అసెట్‌కి పంపాలి.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కావాలంటే అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు..

Exit mobile version