కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది.. తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే NTPC ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది.. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఆసక్తి ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం..
అర్హతలు..
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ సంబంధిత బ్రాంచ్ నుండి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి.. అభ్యర్థులు గేట్ 2023 పరీక్షకు హాజరు కావాలి. సంబంధిత పోస్ట్‌లో BE/B.Tech 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ ని కలిగి ఉండాలి.. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు 65% మార్కులు పొందిన వారు అర్హులు.. అదే విధంగా SC/ST/PH అభ్యర్థులకు 55% మార్కులను సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో ఉంది..
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 300. అయితే, SC/ST/PH కేటగిరీ అభ్యర్థికి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థి దానిని SBI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్‌లో E చలాన్ ద్వారా చెల్లించవచ్చు.
వయోపరిమితి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారికి 27 మించి ఉండకూడదు..ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 అక్టోబర్ 2023.
జీతం..
జీతం రూ. 40,000 నుండి రూ. 140,000 వరకు ఉంటుంది (బేసిక్ పే – రూ. 40,000, ఇ1 గ్రేడ్)..
ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..