NTV Telugu Site icon

NHPC Jobs 2024 : NHPCలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. NHPCలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం 280 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ మార్చి 26. ఈ పోస్టులకు ఎంపిక కోసం అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. గేట్-2023 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అర్హతలు, జీతం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల వివరాలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనే అభ్యర్థులు గేట్ స్కోర్ ద్వారా NHPCలో మొత్తం 280 ట్రైనీ ఇంజనీర్లు/ట్రైనీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు..

అర్హతలు..

అభ్యర్థులు ఇంజనీరింగ్/టెక్నాలజీ/B.Sc కలిగి ఉండాలి. కనీసం 60 శాతం మార్కుల తో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. అప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు…

ఎంపిక విధానం..

గేట్ స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్,పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయబడతారు..

జీతం..

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం శిక్షణ కాలంలో రూ. 50,000 ఆ తర్వాత రూ. 1,60,000 వరకు చెల్లిస్తారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..