NTV Telugu Site icon

NDA Recruitment 2024: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్తుంది.. ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తంగా 198 ఖాళీలను భర్తీ చేయనుంది…

ఖాళీల వివరాలు..

లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు, స్టెనోగ్రాఫర్ GDE-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి. కంపోజిటర్-కమ్-ఫ్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్(OG)- 3, కార్పెంటర్- 2, ఫైర్‌మెన్- 2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్-151 పోస్టులు భర్తీ అవుతాయి.

వయసు..

అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..

అర్హతలు..

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ అర్హతగా ఉంటుంది..

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. రెండిటీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పోస్టింగ్ లభిస్తుంది.

జీతం..

ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 నుంచి రూ. 63,200 మధ్య లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు ముందుగా NDA అధికారిక పోర్టల్ nda.nic.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, కిందికి స్క్రోల్ చేస్తూ ‘న్యూస్ అండ్ ఈవెంట్స్’ అనే సెక్షన్‌లో NDA గ్రూప్-C రిక్రూట్‌మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ యాక్సెస్ చేయాలి. దీంట్లో అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.. ఇంకేదైనా సందేహాలు ఉంటే అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..