NTV Telugu Site icon

IT Recruitment 2023: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Jobs

Jobs

నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న పలు రకాల పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా ఆదాయపు పన్ను శాఖలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 291 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్ట్ లకు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ incometaxmumbai.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం…

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 19, 2024. ఈ పోస్ట్ లకు విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి వంటి నిబంధనలు వేరు వేరుగా ఉన్నాయి.. ఈ వివరాల కోసం నోటిఫికేషన్ ను చూసి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి..

మొత్తం పోస్టుల వివరాలు..

ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ : 14 పోస్టులు
స్టెనోగ్రాఫర్ : 18 పోస్టులు
ట్యాక్స్ అసిస్టెంట్ : 119 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 137 పోస్టులు
క్యాంటీన్ అటెండెంట్ : 3 పోస్టులు

క్రీడా రంగంలో ప్రావిన్యం ఉన్న వాళ్లను ఈ పోస్టులకు సెలెక్ట్ చెయ్యనున్నారు.. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ లో ఉన్న ప్రాధాన్య క్రమం ప్రకారం ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో మాత్రమే ఫీజు చెల్లించాలి. చెల్లింపున కు సంబంధించిన రుజువును దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు సంబందించిన మరిన్ని వివరాలకు అధికార వెబ్ సైటును పరిశీలించాలి..

Show comments