NTV Telugu Site icon

Infosys : ఉద్యోగులకు బంఫర్ ఆఫర్.. ఇక నెలకు 11 రోజులు ఫ్రీ..

Infosis

Infosis

కరోనా వేగంగా ప్రభలుతున్న సమయంలో ఐటీ కంపెనీలు అన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల బలవంతంగా ఆఫీస్ లకు రావాలని కొత్త రూల్స్ పెట్టింది.. కొన్ని కంపెనీలు ఉద్యోగుల పై కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితల్లో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది..

అంటే నెలకు 11 రోజులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొనే వెసులుబాటును కలిగించింది.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల ఎక్స్‌పీరియన్స్‌ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది.. నెలకు పేర్కొన్న కొన్ని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజులను పొందవచ్చు మిగిలిన రోజులలో ఆఫీస్‌ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి.. అంటూ కంపెనీ ఒక సందేశం పంపించింది..

ఇదిలా ఉండగా.. గతంలో కొన్ని కంపెనీలు వారానికి ఐదు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్‌ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ అమలు చేస్తోంది.. ఇప్పుడు ఇన్ఫోసిస్ నిర్ణయం పై మహిళలకు భారీ ఊరట కలుగుతుందని తెలుస్తుంది.. ఇంకా కొన్ని కంపెనీలు ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది..