Site icon NTV Telugu

Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవిలో భారీగా ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

Navy Jobs

Navy Jobs

నిరుద్యోగులకు ఇండియన్ నేవి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవిలో ఖాళీ ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేవీకి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితోపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తారు. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌లను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ పోస్టులకు అర్హతలను, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య – 254

జనరల్‌ సర్వీస్‌-50, పైలట్‌-20, నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌-18, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌-08, లాజిస్టిక్స్‌-30, నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కేడర్‌(ఎన్‌ఏఐసీ)-10, ఎడ్యుకేషన్‌-18, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)-30, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)-50, నావల్‌ కన్‌స్ట్రక్టర్‌-20.

అర్హతలు..

సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ,పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ని­ర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వేతనం: నెలకు రూ.56,100+ ఇతర అలవెన్సులు.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మా­ర్కు లు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.03.2024.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in./ ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఏదైనా సందేహాలు ఉంటే తెలుసుకోవచ్చు..

Exit mobile version