Business and Finance Carrier: ఫైనాన్స్ రంగంలో ఉద్యోగావకాశాల కోసం కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్టూడెంట్స్‌కి ఎలాంటి నాలెడ్జ్ అవసరం? అనే విషయాలను ‘ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్’ ఎండీ ప్రవీణ్ కుమార్ ‘ఎన్-కెరీర్’కి వివరించారు. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్‌కి(బుక్స్‌కి), ఫీల్డ్ ఎడ్యుకేషన్(కంపెనీల్లో వర్క్ ఎక్స్‌పీరియెన్స్)కి మధ్య తేడాను చక్కగా విశ్లేషించారు. ‘‘కాలేజీల్లో పాఠాలు చెప్పేవారు చాలా వరకు కార్పొరేట్స్‌లో పనిచేయకపోవటం వల్ల అక్కడ ఏం స్కిల్స్ అవసరం అనేది వాళ్లు గెస్ చేయలేకపోతున్నారు. దీంతో సిలబస్ వరకే (అందులోనూ కొన్ని కాన్సెప్టుల వరకే) పరిమితమవుతున్నారు. కార్పొరేట్స్‌లో ఉండేవాళ్లు చాలా మంది హ్యాపీగా సెటిలైపోయి ఉంటారు.
కానీ.. టీచింగ్‌కి వచ్చి స్టూడెంట్స్‌ని గ్రూమ్ చేద్దామని అనుకోరు. దీనివల్ల కార్పొరేట్స్‌కి, క్లాస్ రూమ్స్‌కి మధ్య గ్యాప్ ఏర్పడింది. అందుకే మెజారిటీ గ్రాడ్యుయేట్స్ జాబ్ మార్కెట్‌కి సూటబుల్ కాదు అనే వార్తలు వస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల్లోని క్యాబిన్లలో కూర్చొని ఉండే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ మాకు బెస్ట్ ట్రైన్డ్ పీపుల్ కావాలంటారు. కాలేజీల్లోని ఫ్యాకల్టీకి మాత్రం అంత అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయటం కోసమే నేను పదేళ్ల కిందట టీచింగ్ ఫీల్డ్‌కి వచ్చాను’’ అని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను ‘ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్’ ఎండీ ప్రవీణ్ కుమార్ మాటల్లోనే వినాలనుకునేవారు ఈ వీడియో చూస్తే సరిపోతుంది.