కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ఇంజనీర్ పోస్టులను భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పటికే పలు శాఖల్లో నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 5 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు.. 05
ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..
అర్హతలు..
పోస్టును అనుసరించి బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్ /కమ్యూనికేషన్/మెకానికల్/కెమికల్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి..
01.12.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజనీర్‌కు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్‌కు 32 ఏళ్లు మించకూడదు.
జీతం..
నెలకు రూ.45,000 నుంచి రూ.55,000
ఎంపిక విధానం..
ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.12.2023
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ ను సందర్శించగలరు…