Bala Bharathi School: తెలుగు రాష్ట్రాల్లోని పొదుపు సంఘాలు ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. అయితే.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు సాధించిన విజయం మాత్రం అతిపెద్ద విశేషమని, అద్భుతమని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని చెప్పొచ్చు. రూపాయితో పొదుపు మొదలు పెట్టి 7 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మించారు. అక్షరమ్ముక్క కూడా రాని మహిళలు శ్రమదానం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను అందుబాటులోకి తేవటం ఒకరకంగా అసాధ్యమే అయినా సుసాధ్యం చేసి చూపారు. తమలా తమ పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండకూడదనే పట్టుదలతో ఆ తల్లిదండ్రులు పడిన తపన సమాజానికి ఆదర్శమనటంలో ఎలాంటి సందేహంలేదు. మైసూర్ మహరాజ ప్యాలెస్‌ను తలపించేలా, ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూల్‌లా కనిపిస్తున్న ఆ బడి పేరు బాల భారతి స్కూల్. దీనిపై ఆరేళ్ల కిందట ప్రసారమైన ఈ ప్రత్యేక కథనం నిత్య నూతనం. పలుమార్లు ప్రచురణార్హం.
Bala Bharathi School: అమ్మలందరూ కలిసి నిర్మించిన అద్భుతమైన ఒడి ఈ బడి. సరస్వతీదేవి సైతం మురిసిపోయే స్కూల్.

Bala Bharathi School