NTV Telugu Site icon

Ap Jobs 2023: దేవాదాయ శాఖలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే..

Ap Logo

Ap Logo

ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా దేవదాయశాఖలో ఉన్న పలు పోస్టులను నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 70 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల వివరాలు..

35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగాలకు, 05 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)పోస్టులకు… అలాగే.. 30 టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది..

అర్హతలు..

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోపరిమితి అయిదేళ్ల సడలింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు..

జీతం..

ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సుతో జీతం చెల్లిస్తారు.రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ.500వరకు ఉంటుంది…

దరఖాస్తు చివరి తేదీ..

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జనవరి 05, 2024..www.aptemples.ap.gov.in/en-in/home వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.. అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..