కరోనా కారణంగా జీవనోపాధి కష్టం అవుతోంది. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాల్ గూడలో విషాదం చోటుచేసుకుంది. మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాసిడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు.
కరోనా పుణ్యమాని ఎక్కడా కొలువు లేకపోవడంతో డిప్రెషన్ కు గురయ్యాడు. కుటుంబ పోషణ భారం కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడు. మహమ్మద్ అజాజ్ హుమాయూన్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు.