ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నారు.. ఎంతో అన్యోన్యంగా కాపురాన్ని మొదలుపెట్టారు. ఆ జంటను చూస్తే చుట్టూ ఉన్నవారు కుళ్లుకోనేవారు. ఉదయం భర్త బయటికి వెళ్లేటప్పుడు చిరునవ్వులు చిందిస్తూ భార్య ఎదురురావడం.. సాయంత్రం ఇంటికి వచ్చి భార్యతో అతను కబుర్లు చెప్పడం.. భార్యాభర్తల అంటే ఇలాగే ఉండాలి అనేంత అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూసి విధికి కన్ను కుట్టింది. అనుకోని విబేధాల వలన ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన విజయనగరంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. కొత్తవలస పంచాయతీ చీపురువలస గ్రామానికి చెందిన కర్రి రాము(25)కు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన వెంకట హేమదుర్గ(23)తో ఈ ఏడాది జూలై లో వివాహమైంది. పెళ్లైన దగ్గరనుంచి ఈ జంట ఎంతో అనోన్యంగా ఉండేవారు. రాము ఎక్సకవేటర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రోజూ హేమ, భర్త వెళ్లేటప్పుడు చిరునవ్వులు చిందిస్తూ భర్తకు ఎదురొచ్చి సాగనంపేది. ఎప్పటిలానే శనివారం కూడా భర్త విధులకు వెళ్ళేటప్పుడు నవ్వుతూ సాగనంపింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు.. గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త రాము కూడా చీపురువలస గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఉన్న మామిడితోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో ఒక్కసారిగా చీపురువలసలో విషాదం నెలకొంది. భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చాకనే హేమ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని తెలుస్తోంది. మరి ఆ సంభాషణలో వారు ఏం మాట్లాడుకున్నారు అంది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మాత్రం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు.
