Site icon NTV Telugu

కోర్టు ప్రాంగ‌ణంలో భార్య బాధితుడు ఆత్మహత్యాయత్నం..

కోర్టు ప్రాంగణంలో భార్య బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెనాలి కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ బాటిల్‌తో ఓ వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌ సృష్టించాడు. కోర్టు ప్రాంగ‌ణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు చెరుకూరి ప్రదీప్ రామచంద్ర యత్నించారు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విభేధాల నేప‌థ్యంలో కోర్టులో కేసుల విచారణ సాగుతోంది. అయితే కేసుల విషయంలో తన తప్పు లేకున్నా తన భార్య బూటకపు ఫిర్యాదుల మేరకు వన్‌టౌన్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడు.

లైట‌ర్‌తో నిప్పు పెట్టుకుంటుండా న్యాయ‌వాది హ‌రిదాసు గౌరీశంక‌ర్‌ చాక‌చ‌క్యంగా అడ్డుకున్నారు. ప్ర‌దీప్‌ను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇటీవ‌ల ఆర్దిక ఇబ్బందుల‌తో కోర్టులో పెట్రోల్ పోసుకుని ఓ ప్రొఫెస‌ర్‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వ‌రుస‌గా రెండో ఘ‌ట‌న‌ జరగడంతో కోర్టులోని న్యాయ‌వాదులు, సిబ్బందిలో ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version