ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బాగా మద్యం తాగిన స్నేహితుల మధ్య వివాదం చోటుచేసుకుంది. వివాదం కాస్త ముదిరి ఇద్దరు స్నేహితులు కలిసి మరో వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అనంతర పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also:Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు
సోన్‌భద్రలోని రాబర్ట్స్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుర్క్ గ్రామంలో ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత, ఇద్దరు స్నేహితులు గొడవ పెట్టుకున్నారు. గొడవ కాస్త ముదరి మూడవ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై దాడిచేయడంతో.. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు స్నేహితులు కత్తితో మూడవ వ్యక్తిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.
Read Also:Suspended: రెస్టారెంట్‌లో అన్నచెల్లెళ్లిని వేధించిన పోలీస్ అధికారి.. తర్వాత ఏమైందంటే..
ఈ సంఘటన గురించి స్థానికులకు సమాచారం అందించి, పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన 28 ఏళ్ల పప్పును వైద్య కళాశాలలో చేర్చారు, ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసుల విచారణలో, పప్పు తన స్నేహితులు రాజేష్, భవానీలతో కలిసి డ్రగ్స్ సేవిస్తున్నట్లు వెల్లడించాడు . వివాదం ముదిరి గొడవకు దారితీసిందని పోలీసులకు తెలిపాడు బాధితుడు. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
