ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. దావత్ చెప్పలేదన్న కోపంతో.. ఓ వ్యక్తిని కాల్చి చంపాడు గ్రామ పెద్ద భర్త. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడి పట్టుకుని పొట్టు పొట్టు కొట్టి.. అనంతరం పోలీసులకు అప్పగించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ లోని మోహన్‌పూర్ గ్రామంలో నామకరణ కార్యక్రమానికి గ్రామపెద్ద భర్త సుఖ్‌దేవ్‌ను ఆహ్వానించలేదు. సుఖ్ దేవ్ ను పిలవకపోవడంతో గొడవలు జరిగాయి. దీనితో ఆగ్రహించిన సుఖ్‌దేవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అవనీష్‌ను కాల్చి చంపాడు. అవనీష్ తన ఇంటి వెలుపల అక్కడికక్కడే మరణించాడు.
అవనీష్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు విలపించారు. సుఖ్ దేవ్ పై కోపంతో అతన్ని పట్టుకొని తీవ్రంగా కొట్టారు కుటుంబ సభ్యులు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
