ఉత్తర ప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి.. తన తల్లే వ్యభిచార రొంపిలోకి దింపారని ఆరోపించింది. తన తల్లి, ఇద్దరు అక్కలు తనను వేధించారని.. డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది.
Read Also: POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలో లక్నోలోని ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. తన సొంత తల్లి, అక్కలే తనను వ్యభిచార రొంపిలో దింపుతున్నారని.. దీనిపై ఎదురు తిరగడంతో.. తనపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఓ యువతి. అయితే తనను డబ్బుల కోసం వేధించేవారని స్థానిక పోలీస్ స్టేషన్ లో యువతి కేసు పెట్టింది. తనను గుర్తు తెలియని వ్యక్తికి 10 లక్షల రూపాయలకు అమ్మేశారని ఫిర్యాదు చేసింది. ఆమె నిరసన వ్యక్తం చేయడంతో, ఆమెను దారుణంగా కొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Read Also:Off The Record : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? ఓటర్ల మైండ్ సెట్ ఈసారి ఎలా ఉండబోతుంది?
తల్లి, సోదరీమణులు 19 ఏళ్ల బాలికను రూ.10 లక్షలకు అమ్మేశారని పోలీసులు వెల్లడించారు. ఆ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. తనను వ్యభిచారంలోకి దింపుతున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన తల్లి కహకాషా ఖాన్, అక్కలు అక్సా ఖాన్, సమ్రా ఖాన్ తనను హింసించారని, కొట్టారని బాధితురాలు తెలిపింది.
