ఉత్తరప్రదేశ్‌లోని శంభల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను హత్య చేసి అనంతరం అతడి బాడీని గ్రైండర్ లో వేసి రుబ్బి.. మాంసాన్ని కాలువలో పారేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాహుల్ అనే వ్యక్తిని అతని భార్య రూబీ తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటన నవంబర్ 18న జరిగింది. నేరానికి పాల్పడ్డ అనంతరం ఆధారాలను మాయం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని గ్రైండర్ లో వేసి రుబ్బి.. మాంసాన్ని కాలువలో పడేశారని పోలీసులు తెలిపారు.
హత్య చేసిన తర్వాత ఏమి తెలియనట్టుగా ప్రవర్తించిన రూబీ, తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే దర్యాప్తు సమయంలో కీలక ఆధారాలు లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మృతుడి చేతిపై ఉన్న ప్రత్యేక టాటూ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. గతంలో ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ, ఇటువంటి నేరాలు పునరావృతమవుతుండటం ఆందోళనకరమంటున్నారు.. ప్రస్తుతం పోలీసులు రూబీతో పాటు ఆమె ప్రియుడు గౌరవ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
संभल में खौफनाक हत्याकांड: पत्नी ने बॉयफ्रेंड के साथ मिलकर कारोबारी पति की बेरहमी से हत्या, शव के किए टुकड़े, पुलिस कस्टडी में दोनों @Uppolice @sambhalpolice pic.twitter.com/DBQ6y8iFLs
— JOURNALIST FIROZ KHAN 🇮🇳 (@firozkhan07) December 22, 2025
