NTV Telugu Site icon

FAKE MBBS: 9వ తరగతి పాసైన ‘డాక్టర్’.. డిగ్రీ లేకుండానే 20 ఏళ్లుగా సర్జరీలు!

Fake Doctor

Fake Doctor

9వ తరగతి వరకు మాత్రమే చదివిన ఓ వ్యక్తి తాను డాక్టర్‌నని చెప్పుకుంటూ రోగులకు సర్జరీలు కూడా చేశాడు. ఆశ్చర్యకరంగా.. అతను గత 20 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం.. ఈ నకిలీ వైద్యుడు తనను తాను ప్రముఖ కళాశాలలో చదువుకున్న వైద్యుడిగా అభివర్ణించుకుని తన క్లినిక్‌ని తెరిచాడు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వ్యాధుల చికిత్స కోసం అతడి వద్దకు వచ్చేవారు. ఆయా వ్యాధులకు సంబంధించి చిన్నపాటి శస్త్ర చికిత్సలు నిర్వహించి రోగాలు పూర్తిగా నయమయ్యాయని భరోసా కల్పించాడు. దీంతో రోగులు ఎక్కువగా ఆసక్తికనబరిచారు. దాని కారణంగా అతను ప్రసిద్ధ వైద్యుడిగా పేరు తెచ్చుకోవడంలో విజయం సాధించాడు.

READ MORE: JK Polls: జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్

ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం.. ఈ ఘటన థాయ్‌లాండ్‌ జరిగింది. ఇక్కడ 36 ఏళ్ల వ్యక్తి డాక్టర్‌గా నటిస్తూ ప్రజలను ఎంతగానో మోసం చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. మొదట్లో ప్రజలు అతని మధురమైన మాటలను విశ్వసించారు. దీని కారణంగా క్లినిక్‌లో రోగుల పెద్ద క్యూలు ఏర్పడటం ప్రారంభించారు. అయితే ఓ పేషెంట్‌కి ఆపరేషన్‌ తర్వాత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ రావడంతో మళ్లీ డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. దీంతో అతడి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. వైద్యుడి అనుచిత వైఖరి, సంతృప్తికరమైన సమాధానాలు చెప్పకపోవడంతో రోగికి అనుమానం వచ్చింది. రోగి పోలీసులను సంప్రదించి మొత్తం సంఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ నకిలీ సర్జన్‌ను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేశారు. విచారణలో తాను మెడిసిన్ చదవలేదని.. మెడికల్ లైసెన్స్ లేదని అంగీకరించాడు. లైసెన్స్ లేకుండా అక్రమ క్లినిక్ నడుపుతున్నందుకు కిట్టికార్న్ సాంగ్రీపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది కాకుండా, బాధిత రోగి అతనిపై చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించాడు.