Site icon NTV Telugu

Malla Reddy University: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

Mallareddy College

Mallareddy College

Malla Reddy University: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద నిరసన తెలిపాయి. తరగతులు నుంచి బయటకు వచ్చి విద్యార్థులు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు మృతుని బంధువులు, విద్యార్థులు యూనివర్సిటీ లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ని బయట వేసి తగలబెట్టారు. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Read also: Bhatti Vikramarka: వారానికి ఒకసారి నివేదిక పంపండి.. చీఫ్ ఇంజనీర్లకు భట్టి విక్రమార్క ఆదేశం..

యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న ‌అరుణ్ కుమార్ ‌మృతి చెందాడు. యూనివర్సిటీ లో అంబులెన్స్, ప్రధమ చికిత్స సౌకర్యం చేయకపోవడం వల్లే విధ్యార్థి మృతి చెందాడిని ధర్నా చేపట్టారు. కాలేజీలో అంబులెన్సు అందుబాటులో లేక 20 నిమిషాల ఆలస్యం చేయడం వల్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ విద్యార్థులు ఆదోళన చేశారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్ పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థిని మృతిపై కళాశాల యాజమాన్యం స్పందించి విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Manda Krishna Madiga: తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు లేదు..

Exit mobile version