Site icon NTV Telugu

Students Gang War: మరోసారి కన్నెర్ర చేసిన ర్యాగింగ్ భూతం.. కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు!

Students Gang War

Students Gang War

Students Gang War: విద్యార్థుల్లో విచ్చలవిడితనం పెరుగుతోంది. కొంత మంది విద్యార్థులు.. స్కూలు నుంచి కాలేజీలోకి రాగానే రౌడీ ప్రవర్తన అలవాటు చేసుకుంటున్నారు. కాలేజీల్లోనే గ్యాంగులు మెయింటెన్ చేస్తూ దాడులకు దిగుతున్నారు. మరోవైపు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కాలేజీల నుంచి ర్యాగింగ్ భూతం వెళ్లిపోవడం లేదు.

ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో జరిగింది. కొట్టుకుంటున్న వాళ్లంతా అవినాష్ కాలేజీ విద్యార్థులు. ఒకే కాలేజీలో రెండు గ్యాంగులుగా విడిపోయిన విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి అవతలి గ్యాంగ్‌పై దాడులు చేయడం.. అవతలి గ్యాంగ్ స్టూడెంట్స్.. ఇటు ఉన్న వారిపై ప్రతి దాడి చేయడం నిత్యకృత్యం అయిపోయింది. దీంతో రోజూ గొడవలతో ఆ కాలేజీ క్యాంపస్ దద్దరిల్లుతోంది.

వాళ్లల్లో వాళ్లు కొట్టుకుంటూనే ఎల్బీ నగర్ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రతి రోజూ దాడులు- ప్రతి దాడులు జరుగుతుండడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అవినాష్ కాలేజీ విద్యార్థుల న్యూసెన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొత్తంగా 15 మందిపై కేసులు నమోదు చేశారు. అసలు గొడవలకు కారణాలేంటని కనుగొనే పనిలో పడ్డారు.

POCSO Case: ఛీ.. ఛీ.. ప్రియుడితో కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన తల్లి!

మరోవైపు కాలేజీల్లో ఇంకా ర్యాగింగ్ భూతం వెంటాడుతూనే ఉంది. జూనియర్ స్టూడెంట్లు దీని నుంచి తప్పించుకోవడానికి వీల్లేకుండా తయారైంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ స్టూడెంట్లు చేస్తున్న అరాచకాలు శ్రుతి మించుతున్నాయి.

పల్నాడు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన ఘటన. ఇక్కడ ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు చుక్కలు చూపిస్తున్నారు సీనియర్లు. ఇంటర్మీడియెట్ బైపీసీకి చెందిన ఓ విద్యార్థిని విపరీతంగా కొట్టారు. బీసీ హాస్టల్లోకి తీసుకు వెళ్లి కరెంట్ పెట్టి చంపుతామని బెదిరించారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థిని నానా బూతులు తిట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవడానికి పిల్లలను పంపిస్తే.. వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. దీంతో ఈ కేసులో ఇద్దరు సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

Adilabad: బైక్ లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపి ఏం చేసిందో చూడండి..

Exit mobile version