Site icon NTV Telugu

ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం.. ఒకరి అరెస్ట్

గంజాయి అక్రమ రవాణా పెరిగిపోతోంది. ఏ రూపంలోనైనా గంజాయిని తరలిస్తూ అక్రమార్కులు అడ్డంగా బుక్కవుతున్నారు. కొందరు ఇంట్లోనే గంజాయిని పెంచుతూ దానికి బానిసలుగా మారుతున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సైఫాబాద్ పోలీసులు

లకిడికపూల్ రైల్వే క్వార్టర్స్ లో నివసించే మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ టిల్లు 19 సంవత్సరాలు బ్యాండ్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. గంజాయ్ కి అలవాటు పడి దూల్ పేట్ నుంచి గంజాయి కొనుగోలు చేసేవాడు. అందులోవచ్చిన విత్తనాలను తీసుకొని అతని ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో విత్తనాలు వేసి నాలుగు చెట్లను పెంచాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తనిఖీలు చేశారు. టిల్లు పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 20A/ ఎండీపీఎస్ కింద కేసు నమోదు చేసుకొని నిందితుని రిమాండ్ కు తరలించారు సైఫాబాద్ పోలీసులు,

Exit mobile version